తాలిబన్ నేత కీలక ఆదేశాలు
- August 17, 2021
కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది.మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు.ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని,ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను కాపాడాలని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ కీలక నేత ముల్లా యాకూబ్ ఆదేశాలు జారీ చేశారు.తాలిబన్ కీలక నేత ఆదేశాలతో కాబూల్ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.ఈ ఉదయం నుంచి మెడికల్, కూరగాయల దుకాణాలు, బేకరీలు తిరిగి తెరుచుకున్నాయి.నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూకట్టారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!