'అప్నా'లో ఉద్యోగావకాశాలు

- August 21, 2021 , by Maagulf
\'అప్నా\'లో ఉద్యోగావకాశాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో ప్రముఖ ప్రొఫేషనల్ నెట్‌వర్కింగ్ అండ్ జాబ్స్ ప్లాట్‌ఫాం దేశవ్యాప్తంగా పలు కార్యాలయాల్లో 250 మంది సిబ్బంది నియమించనుంది. ముఖ్యంగా ఈ సంస్థ టైర్‌-1, టైర్‌2 నగరాల్లో విస్తరించి ఉంది. ఈ నగరాల్లోని కార్యాలయాల్లో ఇంజనీర్లు, ప్రొడెక్ట్ మేనేజర్లు, బిసినెస్ లీడర్స్ విభాగాల్లో సిబ్బందిని నియమించనున్నారు.

హైదరాబాద్‌, ఇండోర్‌, పాట్నా, నాగపూర్‌, బోపాల్‌, రాజ్‌కోట్‌, వడోదర ప్రాంతాల్లో ఆర్థిక విభాగాల్లో పని చేసేందుకు సంస్థకు ఉద్యోగుల అవసరం ఉంది. ప్రస్తుతం చెన్నై, ముంబాయ్‌, ఢిల్లీ-ఎస్‌సీఆర్‌, బెంగుళూర్‌, హైదరాబాద్‌, పూణే, అహ్మదాబాద్‌, జైపూర్‌, రాంచీ, కోల్‌కత్తా, సూరత్‌, లక్నో, కాన్పూర్‌, లుథియానా, చండీకగర్ వంటి 21 నగరాల్లో అప్నా యాప్ సేవలు అందిస్తోంది.
దీనిపై సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. అభ్యర్థుల సామర్థ్యాలకు సరైన ఉద్యాగ అవకాశాలను వేగంగా అందించడమే తమ ధ్యేయం అన్నారు. మా సంస్థ కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధి చెందుతుందన్నారు. అంతే కాకుండా అప్నా దేశవ్యాప్తంగా మహిళా శ్రామిక శక్తి అభ్యున్నతికి కృషిచేస్తుందన్నారు. మహిళలకు పార్ట్ టైం, వర్క్ ఫ్రం హోం అవకాశాలను అందిస్తున్నామని అన్నారు. భారతదేశం యొక్క పౌరుల సమగ్ర మరియు సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రభుత్వ కార్యక్రమాలు మరియు ప్రయత్నాలతో కూడా సరిపోతుంది.
ఉపాధి అవకాశాలు పొందేందుకు కలిగే ఇబ్బందులను, వాటిని అందిపుచ్చుకొనే అవకాశం అప్నా అందిస్తుందని పారిఖ్ చెబుతున్నారు. ఉద్యోగార్థుల భవిష్యత్తే ప్రధానంగా మా సేవలు అందిస్తున్నామని ఆయన న్నారు. అప్నా ప్రయాణం మరింత గొప్పగా.. ఉండేలా లక్ష్యాలు నిర్దేశించుకుంటామని పారిఖ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com