పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు..

- August 22, 2021 , by Maagulf
పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 27తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • మొత్తం 137 ఖాళీలకు గాను ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–48, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–17, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–50, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–22 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • పైన తెలిపిన పోస్టులకు ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం తప్పనిసరి.
  • అభ్యర్థుల వయసు 27.08.2021 నాటికి 29ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

  • అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
  • అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • చివరగా ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 27-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్‌ చేయండి.

           https://www.powergrid.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com