వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ మస్ట్..విద్యార్ధులకు వర్తింపు

- August 23, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ మస్ట్..విద్యార్ధులకు వర్తింపు

యూఏఈ: విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతులకు సిద్ధమవుతున్న యూఏఈ...స్టూడెంట్స్ కు వ్యాక్సిన్, పీసీఆర్ టెస్ట్ ప్రోటోకాల్ పై గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 12 ఏళ్లు అంతకుపైబడిన విద్యార్ధులు వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఖచ్చితంగా వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టతనిచ్చారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారు, వ్యాక్సిన్ తీసుకోని 12 ఏళ్లలోపు వారు నెలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్లాసుల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల విద్యార్ధుల కోసం ఈ కొత్త ప్రోటోకాల్ ను యూఏఈ ప్రకటించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజు నుంచి 30 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ ప్రోటోకాల్ అమలులోకి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com