కువైట్ టూ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్..కార్యచరణపై తుది కసరత్తు
- August 23, 2021
కువైట్: కువైట్ టూ ఇండియాకు ఇక డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. భారత్ తో పాటు ఆరు దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు తగిన కార్యచరణను సిద్ధం చేస్తోంది కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA). అయితే..వారానికి ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఏయే సిటీలకు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి, రోజుకు ఎంత మంది ప్యాసింజర్లను అనుమతించాలనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై డీజీసీఏ తదుపరి సమావేశంలో చర్చించి తుది కసరత్తు పూర్తి చేయనుంది. ఇదిలాఉంటే..భారత్ తో పాటు ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను ఎత్తివేస్తూ కువైట్ మంత్రిమండలి గత వారమే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







