అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక
- August 23, 2021
కాబూల్: ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గతంలో చెప్పిన ఆగస్ట్ 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు ఆగస్ట్ 31 కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా ఈ హెచ్చరిక చేశారు.
ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంత వరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్ట్ 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







