మూడు ప్రాంతీయ భాషల్లో ఖతార్ పోర్టల్
- March 14, 2016
ఖతార్ కొత్తగా ఓ పోర్టల్‌ని ప్రారంభించింది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం అందించే సర్వీసుల వివరాల్ని సులువుగా తెలుసుకునేందుకు ఈ కొత్త పోర్టల్‌ని రూపొందించారు. ఇ-గవర్నమెంట్ వెబ్సైట్ హుకూమిలో ఈ పోర్టల్ భాగం. అరబిక్, ఇంగ్లీష్ ఇప్పటిదాకా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న భాషలు కాగా, కొత్తగా 'హుకూమి ఫర్ మైగ్రెంట్ వర్కర్స్' పేరుతో హిందీ, నేపాలీస్, తగాలాగ్ భాషల్లో ప్రారంభించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పబ్లిష్ చేసిన వర్కర్స్ రైట్ బుక్‌ని పోర్టల్‌లోని లేబర్ లా సెక్షన్ పొందుపర్చింది. సాధారణ న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఇందులో లభ్యమవుతాయి. హెల్త్ మరియు మెడికల్ కేర్ సెక్షన్, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వివరాల్ని పొందుపర్చింది. ఖతార్ రెసిడెన్స్ పెర్మిట్, క్యుఐడి, ఎక్స్‌టెండింగ్ విజిట్ వీసా వంటి అంశాలకు సంబంధించి ప్రాథమిక నిబంధనల్ని వివరించేలా వీసా అండ్ పర్మిట్స్ సెక్షన్ ఏర్పాట్లు చేసింది. ఖతార్ సంస్కృతి, సాధారణ చట్టాలను గురించి పేర్కొన్నారు. అత్యవసర కాంటాక్ట్ నెంబర్లు, ఫారిన్ ఎంబసీ నెంబర్లు పొందుపరిచారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







