తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
- August 25, 2021
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థుల ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు. ఫలితాలు ఈ విధంగా చెక్ చేసుకోవాలి: ముందుగా ఎంసెట్ అధికారిక వెబ్సైట్ http://eamcet.tsche.ac.inని ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో TS EAMCET result 2021 లింక్ పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. చివరిగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థుల ఫలితాలను కూడా విడుదల చేశారు. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులను కౌన్సిలింగ్‌కి పిలుస్తారు. ఈనెల 30 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు ఆగస్టు 30 నుంచి సెప్గెంబర్ 9 వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సిలింగ్ తేదీలను ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







