షార్జా రఫిద్ సెంటర్ వద్ద మహిళలకు ఉచిత కార్ వాష్, వాహన తనిఖీ సౌకర్యం
- August 26, 2021షార్జా: యూఏఈ మహిళలు తమ వాహనాల్ని ఉచితంగా ఆగస్ట్ 28 నుంచి 31 వరకు షార్జాలోని రఫీద్ సెంటర్ వద్ద వాష్ చేయించుకోవచ్చు, తనిఖీ చేయించుకోవచ్చు. ఎమిరేటీ మహిళల అలాగే వలసదారులైన మహిళలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. రఫిద్ ఆటోమేటివ్ సొల్యూషన్స్ (ఆటో ఎక్స్‌ప్రెస్) మెయిన్ సెంటర్ (అల్ అజ్రాలోని షార్జా రింగ్ రోడ్డు వద్ద) ఈ సౌకర్యం పొందవచ్చు. ముందస్తు అపాయింట్మెంట్ ఏమీ లేకుండా ముందు వచ్చినవారికి ముందు అవకాశం ప్రాతిపదికన ఈ సౌకర్యం కల్పించనున్నారు నిర్వాహకులు. షార్జా అస్సెస్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్, ఎమిరేటీ విమెన్స్ డే (ఆగస్ట్ 28) సందర్భంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రఫీద్ ఆటోమోటివ్ సొల్యూషన్స్ సీఈఓ సలీం సయీద్ అల్ మిద్ఫా మాట్లాడుతూ, యూఏఈలో వుంటోన్న ప్రతి మహిళకూ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ