ఫిలిం ఫేర్ అవార్డ్స్-2014 లిస్ట్

- June 04, 2015 , by Maagulf
ఫిలిం ఫేర్ అవార్డ్స్-2014 లిస్ట్

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ప్రతి ఏటా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషలగాను ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతూనే ఉంది. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా వచ్చే నెలలో సౌతిండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించనున్నారు. 2014 తెలుగు చిత్రాల నామినేషన్ల లిస్ట్ ఓ సారి చూస్తే. ఉత్తమ నటుడు క్యాటగిరీలో : అల్లు అర్జున్ (రేసు గుర్రం), మోహన్ బాబు (రౌడీ), నాగార్జున (మనం), శర్వానంద్ (రన్ రాజా రన్), వెంకటేష్ (దృశ్యం) పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి క్యాటగిరీలో : కాజల్, పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, శృతి హాసన్‌లు ఉన్నారు. ఉత్తమ దర్శకుడు క్యాటగిరీలో : చందూ మొండేటి, శ్రీ ప్రియ, సుజీత్, సురేందర్ రెడ్డి, విక్రమ్ కుమార్‌లు పోటి లో ఉన్నారు. ఉత్తమ చిత్రం క్యాటగిరీలో : 'దృశ్యం', 'మనం', 'రేసుగుర్రం', 'రన్ రాజా రన్', 'కార్తికేయ' చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఫైన తెలిపిన ఈ నామినేషన్ల లో ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com