ఇండియా టూ కువైట్ డైరెక్ట్ ఫ్లైట్స్..వారానికి 760 సీట్ల కేటాయింపు
- August 31, 2021
ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్లను అనుమతించిన కువైట్ ప్రయాణికుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది. ప్రతి రోజు 10 వేల మంది విదేశీ ప్రయాణికులు దేశంలోకి వచ్చేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ కు సంబంధించి ప్రయాణికుల పరిమితులను వెల్లడించింది. ఆమోదించిన 10 వేల సీట్లలో భారత్ నుంచి వచ్చే విమానాల్లో వారానికి 760 సీట్లను కేటాయిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ తెలిపింది. కేటాయించిన కోటాలో భారత విమానయాన సంస్థలకు 380, కువైట్ విమానయాన సంస్థలకు 380 సీట్లను అలాట్ చేసింది. కువైట్ కోటాలోని 380 సీట్లలో కువైట్ ఎయిర్ వేస్ కు 230 సీట్లు, జజీరా ఎయిర్ వేస్ కు 150 సీట్లు కేటాయించింది. ఇదిలాఉంటే భారత్ టూ కువైట్ డెరెక్ట్ ఫ్లైట్స్ షెడ్యూల్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







