ద్వైపాక్షిక బంధం బలోపేతంపై మోడీకి అబుధాబి యువరాజు సందేశం
- August 31, 2021
భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక బంధం, స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు అబుదాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీకి సందేశాన్ని పంపించారు. అధికార పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ ద్వారా ఈ సందేశాన్ని చేరవేశారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో జరిగిన సమావేశం సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధంపై జాయెద్ అల్ నహ్యాన్ ఆకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలపై వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







