రిమోట్ విధానంలో ప్రయివేటు స్కూల్ టీచర్లకు అనుమతి

- September 01, 2021 , by Maagulf
రిమోట్ విధానంలో ప్రయివేటు స్కూల్ టీచర్లకు అనుమతి

రియాద్: దేశం వెలుపల ఉండిపోయిన టీచర్లు రిమోట్ పద్ధతిలో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తూ, మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో సౌదీ అరేబియాకి రాలేకపోయిన మహిళా స్కూల్ టీచర్లకు, పురుష స్కూల్ టీచర్లకు మొదటి సెమిస్టర్ కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రయివేట్, అంతర్జాతీయ మరియు విదేశీ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. స్కూళ్లలో కొత్త విద్యాసంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ అవకాశం కల్పించింది. ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియా నుంచి చాలా మంది టీచర్లు సౌదీ అరేబియా తిరిగి రావల్సి ఉండగా, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వాళ్లంతా తమ తమ దేశాల్లో చిక్కుకుపోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com