అబుధాబి:వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు క్వారంటైన్ తొలగింపు
- September 02, 2021
అబుధాబి: అబుధాబి ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ తన ట్రావెల్ నిబంధనల్ని పౌరులు, రెసిడెంట్స్, విజిటర్స్ (అబుధాబిలోకి ప్రవేశించేవారికి) సడలించడం జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి రానుంది కొత్త విధానం. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు అబుధాబిలోకి వచ్చాక ఎలాంటి క్వారంటైన్ వుండదు. గ్రీన్ లిస్టులో లేని డెస్టినేషన్ల నుంచి వచ్చే వ్యాక్సిన్ పొందని ప్రయాణీకులు మాత్రం 10 రోజులు క్వారంటైన్లో వుండాల్సిందే. వ్యాక్సిన్ పొందినవారు, పొందనివారు..నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ ఫలితాన్ని, ప్రయాణానికి 48 గంటల ముందుగా తీసుకుని సమర్పించాల్సి వుంటుంది. కాగా, వ్యాక్సిన్ పొందిన పౌరులు, రెసిడెంట్స్, విజిటర్స్, పిసిఆర్ టెస్టుని అబుధాబి రాగానే తీసుకోవాలి. ఆ తర్వాత ఆరవ రోజున కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ పొందనివారు (గ్రీన్ లిస్ట్) కూడా పిసిఆర్ టెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత 6 అలాగే 9వ రోజున కూడా టెస్టులు చేయించుకోవాలి. గ్రీన్ లిస్టులో లేని ప్రాంతాల నుంచి వచ్చేవారు వస్తూనే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడంతోపాటు, క్వారంటైన్లోకి వెళ్ళాలి. 9వ రోజున టెస్ట్ చేయించుకోవాలి.
--సుమన్ కోలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్‌కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్‌లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









