భారత్ ఖాతాలో మరో గోల్డ్, సిల్వర్

- September 04, 2021 , by Maagulf
భారత్ ఖాతాలో మరో గోల్డ్, సిల్వర్

టోక్యో: పారాలింపిక్స్‌ 2020 లో భారత అథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు.తాజాగా మిక్సిడ్
50 మీ పిస్టల్ షూటింగ్ లో భారత షూటర్లు మనీష్, సింగ్‌రాజ్ రెండు పతకాలు సాధించారు.ఈ విభాగంలో మొత్తం 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించి షూటర్ మనీష్ స్వర్ణం గెలిచాడు. అలాగే మరో షూటర్ సింగ్‌రాజ్ 216.7 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటికే పారాలింపిక్స్‌ 2020 లో 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్యలతో మొత్తం 13 పతకాలు సాధించి 37 స్థానంలో ఉన్న ఇండియా ఈ రెండు పతకాలను కలుపుకొని మొత్తం 15 పతకాలతో 34 వ స్థానానికి చేరుకుంది. అలాగే మరో ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఫైనల్స్ కు చేరుకొని రెండు పతకాలను ఖాయం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com