48 గంటల్లో అఫ్గాన్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం..ఖతార్ ఆశాభావం
- September 04, 2021
దోహా: అఫ్గాన్ శరణార్ధులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని ఖతార్ వెల్లడించింది. మానవతా కోణంలో కాబూల్ ఎయిర్ పోర్టులో 24 గంటల నుంచి 48 గంటల్లోగా సేవలు ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్లు ఖతార్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా బలగాల చివరి విమానం టేకాఫ్ అయిన తర్వాత అఫ్గాన్ లోని కాబూల్ విమానాశ్రయం ఆంక్షల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. విమానాశ్రయాన్ని మూసివేయడంతో విదేశీ విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. మానవతా సాయానికి ఇది గొడ్డలిపెట్టుగా మారింది. శరణార్ధులకు ప్రయాణానికి అడ్డుకట్టవేసేందుకు తాలిబన్లు అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక చర్య మనవతా సాయానికి సవాల్ గా మారింది. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న శరణార్ధులకు అఫ్గాన్ దాటి వేళ్లే ఏకైక మార్గం కాబూల్ విమానాశ్రయమే. దీంతో విమానాశ్రయంలో సేవల పునరుద్ధరణపై అటు శరణార్ధులు, ఇటు విదేశీ పౌర విమానయాన సంస్థలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే..తాలిబన్లతో చర్చలు జరుపుతూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న ఖతార్...మరో 48 గంటల్లోనే ఈ ఆందోళనకు తెరపడొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకోసం తాము తాలిబన్లతో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. ఇదిలాఉంటే..అమెరికా భద్రతా బలగాలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత యూఏస్ సేనల నిష్క్రమించిన తర్వాత దోహా నుంచి తొలి గల్ఫ్ విమానం కాబూల్ లో ల్యాండ్ అయ్యింది. విమానాశ్రయానికి సంబంధించిన భద్రత, ఇతర సాంకేతిక అంశాలపై ఖతార్..అఫ్గాన్ కు సాయం చేయటంలో భాగంగా దోహా నుంచి తొలి ఫ్లైట్ కాబూల్ లో ల్యాండ్ అయ్యింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!









