భారత్ కరోనా అప్డేట్

- September 04, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం…దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా..ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,40,225 కు చేరింది.మరోవైపు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.ఇక, ఇప్పటి వరకు 67,72,11,205 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com