ఘనంగా 5వ అంతర్జాతీయ భాగవత జయంతి వేడుకలు

- September 04, 2021 , by Maagulf
ఘనంగా 5వ అంతర్జాతీయ భాగవత జయంతి వేడుకలు

సింగపూర్ : తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుండి  5వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములు ఆన్ లైన్ పద్దతిలో ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లైవ్  ద్వారా ఘనంగా నిర్వహించబడినవి.ఐదున్నర గంటలపాటు పాటు నిర్వహించబడిన ఈ ప్రత్యక్ష ప్రసారానికి  యూట్యూబ్ ద్వారా 2000 మరియు ఫేస్ బుక్ ద్వారా 1500కి పైగా వీక్షణలు (playbacks) వచ్చాయి అని నిర్వాహకులు తెలియచేసారు. సెప్టెంబరు 4, 2021  నాడు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమము, పలు భాగవత పద్యాలు, కీర్తనలు, పద్య కథనాలు వంటి ప్రదర్సనలతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ అలరించింది. ఈ వేడుకలలో  ప్రపంచవ్యాప్తంగా ఎందరో పిల్లలు నమోదుచేసుకోగా, వారి నుండి ఎంపికైన 75 మంది పిల్లల ప్రదర్సనలను ప్రత్యక్షప్రసారం చేశారు. సింగపూర్, భారత దేశములనుండే  కాక అమెరికా మరియు మలేషియా దేశాల నుండి కూడా పిల్లలు పాల్గొని కార్యక్రమానికి వన్నె తెచ్చారు.  చిన్నారులలో మన సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, చిన్నారులు మౌర్య మరియు మనుశ్రీ ఆకునూరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు.రమ్య భాగవతుల మరియు నమ్రత దేవల్ల వారికి సహకారం అందిస్తూ పిల్లలని మరింత అలరించారు.    

ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి పలువురు గురువులు పిల్లలకు తమ తమ సంస్థల ద్వారా పాటలను, పద్యాలను నేర్పారు. ముఖ్యంగా ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి (కీర్తన అకాడెమీ ఆఫ్ మ్యూసిక్), షర్మిల (మహతి అకాడెమీ), కిడాంబి విక్రమాదిత్య  (ముకుందమాల బృందం), విద్య కాపవరపు (విద్య సంగీతం అకాడెమీ) మరియు అపర్ణ ధార్వాడ గార్లు తమ విద్యార్థుల ప్రతిభకు గత రెండు నెలలుగా సానపెట్టి ఈ కార్యక్రమంలో ప్రదర్సనకు తయారు చేసారు.   అలాగే, ఈ కార్యక్రమంలో కవుటూరు రత్నకుమార్, మల్లిక్ పుచ్చా వంటి ప్రముఖులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.  

ఈ అంతర్జాల భాగవత జయంత్యుత్సవములు చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు భాగవత ప్రచార సమితి తరపున  నిర్వాహకులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసారు. చివరగా ఈ కార్యక్రామాన్ని విజయవంతంగా నిర్వహించిన  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికి, ముఖ్యంగా నిర్వహణ కమిటీ సురేష్ చివుకుల, నమ్రత దేవల్ల, రమ్య బొమ్మకంటి, రవితేజ భాగవతుల, విద్యాధరి కాపవరపు మరియు చి.మౌర్య ఊలపల్లి లకు మా సంస్థ హృదయ పూర్వక ధన్యవాదములు.ఈ మహత్కార్యక్రమాన్ని చూసిన వారికి, సహకరించిన వారికి  హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనములు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com