కువైట్ విమానాశ్రయంలో కార్యకలాపాల పెంపు
- September 05, 2021
కువైట్: కరోనా పాండమిక్ నుంచి ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో డైరెక్ట్ విమానాల సంఖ్య పెరుగుతోంది.. కుైవట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాక్టివిటీస్ రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈజిప్టు నుంచి విమానాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 137 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో 68 కువైట్ నుంచి వెళుతుండగా, కువైట్ వచ్చేవి 69 విమానాలు. స్పెషల్ విమానాలు, కార్గో విమానాలు అదనం. కైరో నుంచి 12 విమానాలు, ఈజిప్ట్ ఎయిర్ నుంచి 5 విమానాలు, జజీరా ఎయిర్వేస్ మరియు ఫ్లై ఈజిప్ట్ నుంచి విమానాల్ని ఆపరేట్ చేస్తున్నారు. దుబాయ్, బీరుట్, కైరో, దోహా, ఇస్తాంబుల్, సార్జా, బహ్రెయిన్, కొలంబో, అబుదాబీ, మనీలా, లండన్, బిష్కెక్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు నడుస్తున్నాయి. అయితే, ఇండి నుంచి విమానాల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఈ వారంతంలో సానకూల ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..