ఏపీ కరోనా అప్డేట్
- September 06, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,333 పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 2,69,82,681కు చేరగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,22,064కు పెరిగింది. రికవరీ కేసులు 19,93,589కు చేరగా… ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,925గా ఉంది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,550 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







