ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు..
- September 07, 2021
కాబూల్: ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశారు. 11 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, డిప్యూటీ ప్రధానిగా ముల్లా బరాదర్ వ్యవహరించనున్నారు. గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల అది వాయిదా పడింది.అయితే తాలిబన్లు ప్రభుత్వంలో అంత ఊహించినట్టుగానే.. మహిళలకు మాత్రం చోటు కల్పించలేదు.
ఇక, అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన తర్వాత.. తాలిబన్లు చాలా వేగంగా పావులు కదిపారు. ఆఫ్ఘాన్లోని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ వేగంగా ముందుకు కదిలారు. ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తమ చేతుల్లోకి తీసుకన్న సంగతి తెలిసిందే. ఇక, ఆగస్టు 30వ తేదీన అమెరికాల పూర్తిగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెళ్లిపోయాయి.అయితే ఆఫ్ఘానిస్తాన్‌లో వారం క్రితమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చెప్పినప్పటికీ.. అది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తాలిబన్లు.. అక్కడ ముల్ల మహమ్మద్ హసన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్‌లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









