తీవ్ర జ్వరం, విరేచనాలతో ఒకే ఆస్పత్రిలో చేరిన 130 మంది చిన్నారులు..
- September 14, 2021
వెస్ట్ బెంగాల్: మహమ్మారి థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల మధ్య ఉత్తర బెంగాల్లోని జల్పాయిగురికి చెందిన 130 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరం, విరోచనాలతో కనీసం 130 మంది పిల్లలు జల్పాయిగురి సదర్ ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. COVID-19 మహమ్మారి మూడవ వేవ్ పిల్లలకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణుల హెచ్చరికల మధ్య చిన్నారులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా అందరికీ అత్యవసర చికిత్స అందుబాటులో ఉంటుంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని అధికారి మీడియాకి వివరించారు. అవసరమైతే, పిల్లలకు కోవిడ్ టెస్ట్ చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







