ఆప్ఘాన్కు అండగా మేముంటాం: జైశంకర్
- September 14, 2021
ఢిల్లీ: ఆప్ఘానిస్తాన్కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఆప్ఘాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మానవ సంక్షోభం ఏర్పడిందని, దీంతో ఆ దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆప్ఘానిస్తాన్లో నెలకొన్న మానవ సంక్షోభం యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సమావేశంలో నిర్వహించింది. ఈ సమవేశంలో భారత్ తన పాత్ర గురించి వివరించింది.
ఆప్ఘాన్ను అమెరికా బలగాలు వీడిన తర్వాత తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. మహిళలపై తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆహార, ఆర్థిక, రాజకీయ, సామాజిక భద్రత వ్యవహారాలతో ఆప్ఘాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఆప్ఘాన్లోని ప్రస్తుత పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అక్కడ పేదరికం మరింత పెరిగే అవకాశముందని యూఎన్ఓ అంచనాలను మరోసారి గుర్తు చేశారు. అయితే ఎప్పటిలానే ఆప్ఘాన్తో భారత్ స్నేహాపూర్వక సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ఘాన్ ప్రజల తరపున నిలబడేందుకు భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







