సూపర్ ఫీ చెల్లిస్తే తక్షణమే గ్రీన్ కార్డు లభ్యం!
- September 14, 2021
America Green Card: అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారికి ఇది కచ్చితంగా శుభవార్తే. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డు నిరీక్షణలో ఉన్నవారికి ఊరట కల్గించే వార్త ఇది. సూపర్ ఫీ చెల్లిస్తే కనుక..అర్హులైనవాళ్లంతా అప్పటికప్పుడే గ్రీన్‌కార్డు సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.
అమెరికాలో స్థిరపడటం లేదా ఉద్యోగం చేయడం చాలామందికి ఓ డ్రీమ్. అటువంటిది అక్కడి గ్రీన్ కార్డు (Green Card) పొందడమంటే మాటలు కాదు. అందుకే చాలామంది గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ అందరికీ ఇప్పుడు గుడ్‌న్యూస్. కచ్చితంగా ఉరట కల్గించే వార్త. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు సూపర్ ఫీ చెల్లించేందుకు ముందుకొస్తే..గ్రీన్‌కార్డు తక్షణం పొందవచ్చు. ఈ మేరకు జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియేషన్ బిల్లులో వివరాలున్నాయి. కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
చిన్నతనంలో తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చి 21 ఏళ్లు నిండినవారు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు ప్రకారం సూపర్ ఫీ అంటే సప్లిమెంటరీ ఫీజు కడితే శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలో కాంగ్రెస్ ముందుకు రానున్న ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే ధీమాలో అధికార పార్టీ ఉంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల్ని ప్రతి యేటా అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తోంది. ఇందులో ఏ ఒక్క దేశానికి 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు ఇవ్వకూడదనే నిబంధన కూడా ఉంది. గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటున్నారు. కాటో ఇనిస్టిట్యూట్‌కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ చేసిన అధ్యయనం ప్రకారం గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్న భారతీయులు సంఖ్య గత ఏడాది ఏప్రిల్ నాటికి 7.41 లక్షలుగా ఉంది. ఈ అందరికీ గ్రీన్‌కార్డు రావాలంటే మరో 84 ఏళ్లు నిరీక్షణ తప్పదనేది అంచనా. అందుకే సూపర్ ఫీ(Super Fee) చెల్లిస్తే గ్రీన్‌కార్డు రావడం అనేది ఓ మంచి అవకాశంగా ఉంది. 5 వేల డాలర్లు చెల్లిస్తే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం రావడం నిజంగానే ఆనందించే విషయం.
అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటు రవాణా, ఐటీ కంపెనీల్లో పనిచేసేవారికి కంపెనీ యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా..5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్‌కార్డు పొందే అవకాశముంటుంది. ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు ప్రయార్టీ తేదీ కంటే మరో రెండేళ్లు ఎక్కువగా నిరీక్షించాల్సివచ్చినప్పుడు 5 వేల డాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడే గ్రీన్‌కార్డు లభిస్తుంది. కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తూ..అదే నిర్ణీత రెండేళ్లు నిరీక్షించిన తరువాత సూపర్ ఫీ 2 వేల 5 వందల డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా తొలగింపు, హెచ్1 బీ వీసా(H1B Visa) వార్షిక కోటా పెంచడం వంటివాటికి బిల్లులో చోటు లేదు. అయితే జో బిడెన్(Joe Biden) ప్రభుత్వం కేవలం ఆదాయాన్ని పెంచుకునేందుకే ఈ పని చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







