భీమ్లా నాయక్: వచ్చేస్తున్న రానా లుక్స్
- September 14, 2021
పవన్ కళ్యాణ్- రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకి అమితమైన ఆనందం కలిగించాయి. పవన్ టీజర్, ఇంట్రో సాంగ్ ప్రకంపనాలు కూడా సృష్టించాయి. అయితే రానాకి సంబంధించి ఒక్క పోస్టర్, వీడియో కూడా విడుదల చేయకపోవడంతో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. . రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అని సముదాయించింది. తాజా సమాచారం ప్రకారం రానా పాత్రకు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్షణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ సినిమాపై రెట్టింపు అంచనాలు పెంచేలా ఉంటుందట. ఇక అక్కడ నుండి ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు రాబోతున్నాయని టాక్. మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఈగోయిస్టిక్ పెద్దమనిషికి, సిన్సియర్ పోలీసాఫీసర్ కి మధ్య సాగే టిట్ ఫర్ ట్యాట్ గేమ్ ని భీమ్లా నాయక్ చిత్రంలో చూపించనున్నారు. బిజు పాత్రలో పవన్ .. పృథ్వీ పాత్రను రానా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ దీనికి స్క్రీన్ ప్లే – మాటలు రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







