భీమ్లా నాయక్: వచ్చేస్తున్న రానా లుక్స్
- September 14, 2021పవన్ కళ్యాణ్- రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతి బరిలో నిలవనున్న ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకి అమితమైన ఆనందం కలిగించాయి. పవన్ టీజర్, ఇంట్రో సాంగ్ ప్రకంపనాలు కూడా సృష్టించాయి. అయితే రానాకి సంబంధించి ఒక్క పోస్టర్, వీడియో కూడా విడుదల చేయకపోవడంతో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. . రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అని సముదాయించింది. తాజా సమాచారం ప్రకారం రానా పాత్రకు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్షణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ సినిమాపై రెట్టింపు అంచనాలు పెంచేలా ఉంటుందట. ఇక అక్కడ నుండి ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు రాబోతున్నాయని టాక్. మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఈగోయిస్టిక్ పెద్దమనిషికి, సిన్సియర్ పోలీసాఫీసర్ కి మధ్య సాగే టిట్ ఫర్ ట్యాట్ గేమ్ ని భీమ్లా నాయక్ చిత్రంలో చూపించనున్నారు. బిజు పాత్రలో పవన్ .. పృథ్వీ పాత్రను రానా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ దీనికి స్క్రీన్ ప్లే – మాటలు రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం