ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- May 21, 2024
ముంబై: ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు మృతి చెందాయి. ఇవన్నీ ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి వేసవిలోనూ నవీ ముంబయి పరిసరాల్లో చిత్తడి ప్రాంతాలతోపాటు థానే క్రీక్‌కు ఫ్లెమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి.
విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లెమింగో గుంపును ఢీకొట్టింది. దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి.చచ్చిపడిన ఫ్లెమింగోలను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్‌కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కళేబరాలను తీసుకెళ్లారు.చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షల కళేబరాల కోసం గాలించారు. అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి పంపించారు.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







