తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- September 15, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణ లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు మలబార్ గ్రూప్ అధినేత యంపి అహ్మద్ మరియు సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఈమేరకు మలబార్ గ్రూప్ తమ నిర్ణయాన్ని తెలిపింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పధాన్ని ప్రత్యేకంగా అభినందించింది. తమ గ్రూప్స్ కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరి మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం 750 కోట్ల రూపాయల పెట్టుబడి ని తెలంగాణలో పెట్టనున్నట్టు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్ మరియు డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడి తో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడి ఉన్న వ్యాపార అనుకూలతలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్ కి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం తో పాటు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







