యాదాద్రి ఆలయ విస్తరణ.. భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన
- September 16, 2021
యాదాద్రి ఆలయ విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అధికారుల్ని నిలదీస్తూ... అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నారు. ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటించడం లేదా?... అధికారులతో సీఎం అలా చెప్పిస్తున్నారా?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం నివాసం వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టంచేశారు.
యాదాద్రి కొండ చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. అంజనాపురిలో స్థానికులు 50 ఇళ్లు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేసింది. కానీ.. ఖాళీ స్థలాలు కోల్పోయిన 120 మంది నిర్వాసితులకు పరిహారం అందలేదని బాధితులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హామీ ప్రకారం సైదాపురంలో స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







