ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
- September 17, 2021
తిరుమల: కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.థర్డ్ వేవ్‌పై రకరకాల అంచనాలున్నాయి.అయితే.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కారణంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఇక, మరో వారం రోజులలో ఆన్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభిస్తామన్న ఆయన.. మరోవైపు.. అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రచారం కల్పిస్తాం అన్నారు.అన్నమయ్య కీర్తనలు అన్నింటికి ప్రాచుర్యం కల్పించడానికి అదివో అల్లదివో పాటల పోటీ కార్యక్రమాని ప్రారంభిస్తున్నామని తెలిపారు.15 నుంచి 25 సంవత్సరాల వయ్ససు కలిగినవారు ఈ పాటల పోటీల్లో పాల్గొనవచ్చన్న ఆయన.. జిల్లా స్థాయిలో ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పోటీ కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







