ప్ర‌యాణికుల ప‌రిమితి సంఖ్య‌ను పెంచాల‌ని కోరిన DGCA

- September 18, 2021 , by Maagulf
ప్ర‌యాణికుల ప‌రిమితి సంఖ్య‌ను పెంచాల‌ని కోరిన DGCA

కువైట్: దేశంలోకి అనుమ‌తించే ప్ర‌యాణికుల ప‌రిమిత సంఖ్య‌ను మ‌రింత‌గా పెంచాలని కైవైట్ మంత్రిమండ‌లిని ఆ దేశ పౌర విమాన‌యాన శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కోరారు. ప్ర‌స్తుతం 10,000 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. అయితే..ఇత‌ర దేశాల నుంచి కువైట్ వ‌చ్చేందుకు ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నార‌ని..దీంతో లిమిటెడ్ ఫ్లైట్ స‌ర్వీసుల‌పై ఒత్తిడి పెరుగుతోంద‌ని అన్నారు. టికెట్‌ ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోయాయ‌న్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, ఇండియా నుంచి వ‌చ్చే వారు ఎక్కువ ధ‌ర‌కు టికెట్ల‌ను కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. అంతేకాదు..ప‌రిమిత సంఖ్య‌లోనే ప్ర‌యాణికుల‌ను అనుమ‌తిస్తున్న కార‌ణంగా కువైట్ విమాన‌యాన సంస్థ‌లు కొత్త ప్రాంతాల‌కు  స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించ‌లేక‌పోతున్నాయ‌ని కూడా వివ‌రించింది. ఈ ప‌రిస్థితుల‌ను అదిగ‌మించేందుకు దేశంలోకి అనుమ‌తిస్తున్న ప‌రిమిత సంఖ్య‌ను పెంచాల‌ని డీజీసీఏ కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com