అనుమ‌తి లేని పెర్ఫ్యూమ్ కంపెనీలో సోదాలు..52,000 మెటీరియ‌ల్ సీజ్‌

- September 18, 2021 , by Maagulf
అనుమ‌తి లేని పెర్ఫ్యూమ్ కంపెనీలో సోదాలు..52,000 మెటీరియ‌ల్ సీజ్‌

సౌదీ: ప్ర‌భుత్వం నుంచి స‌రైన అనుమ‌తి లేకుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా నిర్వ‌హిస్తున్న కాస్మోటిక్స్ త‌యారీ కేంద్రాల‌పై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ త‌మ దాడులు కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగా  రఫా గవర్నరేట్‌లోని ఒక రెస్ట్ హౌస్‌లో సోదాలు నిర్వ‌హించిన అధికారులు పెర్ఫ్యూమ్ త‌యారీకి వినియోగించే 52,000 మెటిరీయ‌ల్ ను సీజ్ చేశారు.  సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించడానికి అనుమ‌తించ‌ని ఉత్పత్తులతో పాటుగా రసాయనాలు, సింథ‌టిక్ ఆయిల్ ఉత్ప‌త్తులు ఉన్నాయ‌ని అన్నారు. సీజ్ చేసిన వాటిలో సింథ‌టిక్ ఆయిల్ 17,500 డబ్బాలు,  ఖాళీ కంటైనర్లు, 30,000 స్టిక్కర్లు, 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సౌదీ చ‌ట్టాల మేర‌కు త‌గిన అనుమ‌తులు లేకుండా కాస్మోటిక్స్ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌టం, మార్కెటింగ్ చేయ‌టం నేరం. ఈ నేరానికి పాల్ప‌డిన వారికి  ఐదు మిలియన్ రియాల్‌ల వ‌ర‌కు జ‌రిమానా ఉంటుందని అధికారులు హెచ్చ‌రించారు. చ‌ట్ట ఉల్లంఘునుల వివ‌రాలు తెలిసిన పౌరులు యూనిఫైడ్ నంబర్ 19999 కు కాల్ చేసి త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com