సాధార‌ణ జీవితానికి చేరువ‌లో ఉన్నామ‌న్న కువైట్ ప్ర‌ధాని

- September 18, 2021 , by Maagulf
సాధార‌ణ జీవితానికి చేరువ‌లో ఉన్నామ‌న్న కువైట్ ప్ర‌ధాని

కువైట్: కోవిడ్ గాయంతో చిన్నాభిన్న‌మైన ప్ర‌జా జీవ‌ణ గ‌మ‌నం ఇప్పుడిప్పుడే చ‌క్క‌బ‌డుతోంద‌ని కువైట్ ప్ర‌ధాని అల్ ఖ‌లీద్ అన్నారు. కోవిడ్ మున‌ప‌టిలా మ‌ళ్లీ సాధార‌ణ జీవితానికి చేరుకునేందుకు మ‌రో అడుగు దూరంలోనే ఉన్నామ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అర్హులైన వారిలో ఇప్పటికే 79 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించామ‌ని, ఇందులో 71 శాతం మంది డ‌బుల్ డోస్ తీసుకున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ప‌క‌డ్బందీగా చేప‌ట్ట‌డంతో వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ త‌గ్గుతోంద‌ని, ప్ర‌స్తుతం పౌరులు, ప్ర‌వాసీయుల్లో కోవిడ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇదే తీరును ఇంకొన్నాళ్లు కొన‌సాగించ‌గ‌లిగితే..తిరిగి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొనేందుకు ఎన్నో రోజులు ప‌ట్ట‌ద‌న్నారు.

ఇదిలాఉంటే.. ఫర్వానియా హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన క్యాబినెట్...కోవిడ్ ను ఎదుర్కోవ‌టంలో ప్రాణాల‌ను సైతం ఫ‌ణంగా పెట్టిన వైట్ ఆర్మీ(వైద్య సిబ్బంది) సేవ‌ల‌ను గుర్తు చేసుకుంది. కోవిడ్ పై పోరాటంలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తూ అమ‌రులైన వైద్య సిబ్బంది త్యాగాల‌ను ఎప్ప‌టికి గుర్తుంచుకునేలా వారిపై చ‌క్క‌టి డాక్యుమెంట‌రీని రూపొందించే బాధ్య‌త‌ను స‌మాచార విభాగానికి కేబినెట్ అప్పంగించింది. అంతేకాదు..అమ‌రుల త్యాగాల‌కు గౌర‌వ చిహ్నాంగా జాబర్ అల్-అహ్మద్ హాస్పిటల్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఒకదానికి వారి పేర్లను పెట్టాల‌ని నిర్ణ‌యించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com