6వ ఎడిషన్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ది కాన్సూల్ జనరల్’ దుబాయ్.!
- September 18, 2021
రాస్ అల్ ఖైమా: దుబాయ్లో భారత కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ది కాన్సుల్ జనరల్’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంబర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్సి, రస్ అల్ ఖైమాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్క్ ఫోర్స్ కోసం నిర్వహించారు. అంబర్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మ దేవ్ భట్, ఇండియన్ బిజినెస్ మరియు ప్రొఫెషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సబ్రతా ముఖర్జీ, ఆస్టర్ వలంటీర్స్ మెడికల్ టీమ్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులతో ఇలా ఇంటరాక్ట్ అవడం ఆనందంగా వుందని కాన్సుల్ జనరల్ పేర్కొన్నారు.

ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్ల భద్రత, హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో భారతీయులందరూ తమ మాతృదేశం పట్ల ప్రత్యేకమైన భక్తిభావంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, అస్టర్ నుంచి మెడికల్ టీమ్ అలాగే, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిథులు కార్మికులతో సమావేశమవడం, పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడాన్ని అభినందించారు కాన్సుల్ జనరల్. మెడికల్ టీమ్, వర్కర్లకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించారు. కాన్సుల్ జనరల్ అక్కడే ఓ మొక్కను నాటారు.ర్యాఫిల్ డ్రా నిర్వహించి కాన్సుల్ జనరల్, బహుమతుల్ని విజేతలకు అందంచారు.






తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







