APEPDCLలో ఉద్యోగాలు
- September 23, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్మెన్ గ్రేడ్ -2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. APEPDCL తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.apeasternpower.com/వెబ్సైట్ చూడొచ్చు. అర్హతలు: ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్తులు అర్హులు. అలాగే అభ్యర్థులకు ఈ ఏడాది జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా జరిగిన ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే శారీరక సామర్థ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) కు పిలుస్తారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









