ముహరాక్ ఐడెంటిటీ కార్డ్ సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం

- September 24, 2021 , by Maagulf
ముహరాక్ ఐడెంటిటీ కార్డ్ సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం

మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ గవర్నమెంట్ అథారిటీ (iGA), ముహరాక్‌లోని సీఫ్ మాల్‌లోగల ఐడీ కార్డు సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం అవుతుందని, ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపింది. అన్ని ఐడీ కార్డు సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తిగతంగా హాజరు అవ్వాలనుకోనివారి కోసం ఆన్‌లైన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. ఈ కేంద్రాన్ని సందర్శించాలనుకునేవారు ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది వెబ్‌సైట్ ద్వారా. కరోనా నిబంధనల్ని తప్పక పాటించాలి. సేవల విషయమై సూచనల్ని అందించవచ్చు. పౌరులు అలాగే నివాసితులు ఈ కేంద్రం వద్ద సేవల్ని పొందవచ్చు. ఐడీ కార్డు జారీ, రెన్యువల్స్, పాడైపోయిన లేదా పోగొట్టుకున్న కార్డుల్ని తిరిగి పొందడం వంటి వాటి కోసం ఈ కేంద్రాన్ని సందర్శించవచ్చు. వినియోగదారులు తమ ఐడీ కార్డు చిప్ డిటెయిల్స్‌ని ఈ కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ ద్వారా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com