ముహరాక్ ఐడెంటిటీ కార్డ్ సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం
- September 24, 2021
మనామా: ఇన్ఫర్మేషన్ మరియు ఇ గవర్నమెంట్ అథారిటీ (iGA), ముహరాక్‌లోని సీఫ్ మాల్లోగల ఐడీ కార్డు సర్వీస్ సెంటర్ ఆదివారం పునఃప్రారంభం అవుతుందని, ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపింది. అన్ని ఐడీ కార్డు సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా లభ్యమవుతాయి. వ్యక్తిగతంగా హాజరు అవ్వాలనుకోనివారి కోసం ఆన్లైన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. ఈ కేంద్రాన్ని సందర్శించాలనుకునేవారు ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది వెబ్సైట్ ద్వారా. కరోనా నిబంధనల్ని తప్పక పాటించాలి. సేవల విషయమై సూచనల్ని అందించవచ్చు. పౌరులు అలాగే నివాసితులు ఈ కేంద్రం వద్ద సేవల్ని పొందవచ్చు. ఐడీ కార్డు జారీ, రెన్యువల్స్, పాడైపోయిన లేదా పోగొట్టుకున్న కార్డుల్ని తిరిగి పొందడం వంటి వాటి కోసం ఈ కేంద్రాన్ని సందర్శించవచ్చు. వినియోగదారులు తమ ఐడీ కార్డు చిప్ డిటెయిల్స్‌ని ఈ కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







