రోడ్డు ప్రమాదం: వాహనదారులకు అబుధాబి పోలీసుల హెచ్చరిక

- September 25, 2021 , by Maagulf
రోడ్డు ప్రమాదం: వాహనదారులకు అబుధాబి పోలీసుల హెచ్చరిక

అబుధాబి: మోటర్ వే హార్డ్ షోల్డర్ ప్రమాద ఘటనకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన అబుదాబీ పోలీసులు, ఇలాంటి ప్రమాదాల పట్ల వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. ఓ వాహనం ప్రమాదకరమైన రీతిలో హార్డ్ షోల్డర్‌లోకి దూసుకొచ్చింది. అత్యవసర వాహనాల కోసం మాత్రమే హార్డ్ షోల్డర్ మార్గాన్ని వినియోగించాల్సి వుంటుంది. కాగా, ప్రమాదం కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎప్పటికప్పుడు వాహనదారుల్ని ట్రాఫిక్ నిబంధనల విషయమై అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1,000 దిర్హాముల జైలు, ఆరు పాయింట్లను లైసెన్సుకి జత చేయడం జరుగుతుంది. కాగా, అబుధాబిలో కొత్తగా 700 హైటెక్ స్పీడ్ కెమెరాలను రహదార్లపై ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వాతావరణ సంబంధిత సమాచారాన్ని కూడా ఈ స్పీడ్ కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com