పోస్ట్ ఆఫీసుల ద్వారా రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ అప్లికేషన్లు: బహ్రెయిన్ ఎన్‌పిఆర్ఎ

- September 27, 2021 , by Maagulf
పోస్ట్ ఆఫీసుల ద్వారా రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ అప్లికేషన్లు: బహ్రెయిన్ ఎన్‌పిఆర్ఎ

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభతరం చేశారు. నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో బహ్రెయిన్ పోస్ట్ ద్వారా రెసిడెన్సీ పర్మిట్ స్టిక్కర్ అప్లికేషన్స్ జారీ చేయబడతాయి. అడ్మినిస్ట్రేటివ్ మరియు సాంకేతిక ప్రక్రియలు పూర్తయ్యాక ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. ఇ-సర్వీసుల ద్వారా ఆయా సేవల్లో వేగం పెరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్ పోస్ట్ వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునే దిశగా ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ బదర్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com