ముఖ్యమైన కార్మిక సమస్యలపై బిసిసిఐ మరియు ఎల్ఎంఆర్ఎ మధ్య చర్చ
- September 30, 2021
మనామా: బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (బిసిసిఐ) మరియు ఇండస్ట్రీ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమైన కార్మిక సమస్యలపై చర్చించడం జరిగింది. సంబంధిత ప్రభుత్వ శాఖలు, సివిల్ ఇనిస్టిట్యూషన్స్ సహకారంతో లేబర్ మార్కెట్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించడం, ఈ మార్కెట్ మరింత ప్రభావంతంగా వుండేందుకు మార్గాల్ని అన్వేషించడంపై సమావేశంలో బిసిసిఐ, ఎల్ఎంఆర్ఎ చర్చించాయి. ఎల్ఎంఆర్ఎ క్లయింట్ కేర్ డైరెక్టర్ ఎమాన్ షబీబ్, యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్షన్ హమాద్ అల్ ముల్లా మరియు హెడ్ ఆఫ్ లేబర్ ఇన్స్పెక్షన్ జాఫర్ అబ్దుల్ హాసన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బిజినెస్ ఓనర్లు, ఎంప్లాయర్ల తరఫున హాజరైనవారు పలు సమస్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయమై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..







