అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.!

- October 05, 2021 , by Maagulf
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.!

అరుణాచల్ ప్రదేశ్‌:  అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, భూకంపం సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించారు అధికారులు. గడిచిన నాలుగు రోజుల్లో ఈ రోజు ఉదయం 8.8 గంటలకు వచ్చిన భూకంపం మూడవదిగా అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, అక్టోబర్ 2 నుండి ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్‌లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com