సౌదీ అఫ్రూవ్ చేయని వ్యాక్సిన్ వేసుకుంటే 2 రోజలు క్వారంటైన్

- October 05, 2021 , by Maagulf
సౌదీ అఫ్రూవ్ చేయని వ్యాక్సిన్ వేసుకుంటే 2 రోజలు క్వారంటైన్

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త రూల్స్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులకు కచ్చితంగా 2  రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఐతే సౌదీ ప్రభుత్వం అఫ్రూవ్ చేసిన ఫైజర్ బయోటెక్, ఆక్స్ ఫోర్డ్, అస్ట్రా జెనికా, మోడర్న్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రం కరోనా టెస్టులు మాత్రమే చేయనుంది. ప్రభుత్వం అప్రూవ్ చేయని వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండు రోజుల పాటు క్వారంటైన్ నిబంధన తప్పనిసరి గా అమలు చేయనుంది. ఆ తర్వాత వారికి కరోనా టెస్టు చేస్తారు. ఐతే 8 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం రెండు రోజుల క్వారంటైన్ నిబంధన మాత్రమే విధించారు. వారికి ఎలాంటి మెడికల్ టెస్టులు ఉండవని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సౌదీ కి వచ్చిన వారికి 5 రోజుల క్వారంటైన్ నిబంధన ఉండేది. ఆ నిబంధనను మార్చేసి రెండు రోజుల క్వారంటైన్ రూల్ ను తెచ్చారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com