ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు కొత్త నిబంధనలు!
- October 07, 2021
కువైట్: కువైట్ లో వెహికల్స్ వినియోగం పెరగుతుండటంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పొలుష్యన్ సమస్య కూడా అధికమైంది. దీంతో ఈ సమస్య ను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్గత వ్యవహారాల శాఖ సెక్రటరీ, లెఫ్ట్ నెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ సీనియర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వెహికల్స్ వినియోగం తగ్గించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ ను కఠినం చేయాలని చర్చించారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ తగ్గించాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లు తగ్గించి వెహికల్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇక ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలోనూ కొత్త ప్రతిపాదనలు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. కువైట్ పౌరుల ఒక్కొక్కరికే ఎక్కువ వెహికల్స్ ఉండటంతో ఎక్కువ మంది డ్రైవర్లు గా పెట్టుకుంటున్నారు. ప్రవాసులను కూడా తగ్గించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కఠిన నిబంధనలు చేయనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







