500 కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ నియామకం చేపట్టనున్న యూఏఈ ఎయిర్‌లైన్

- October 08, 2021 , by Maagulf
500 కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ నియామకం చేపట్టనున్న యూఏఈ ఎయిర్‌లైన్

యూఏఈ: యూఏఈలో ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ 500 కస్టమర్ సర్వీస్ ఏజెంట్లను నియమించుకోనుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామకాలు దుబాయ్‌లో జరుగుతాయి. రెండేళ్ళు కస్టమర్ సర్వీస్ ఇండస్ట్రీలో అనుభవం కలిగి వుండి, హై స్కూల్ సర్టిఫికెట్ కలిగి వుండి, ఇంగ్లీషు రాయడం మాట్లాడటంలో అనుభవం కలిగి వుండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కనీసపాటి అవగాహన వుండి, సేల్స్ స్కిల్స్ కలిగి వుండి, అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడగలిగే ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బుర్ దుబాయ్, హాలిడే ఇన్‌లో ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి వుంటుంది. తమ రెజ్యూమ్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అలాగే ఫుల్ సైజ్ ఫొటో తమ వెంట తీసుకురావాలి. ప్రతి నెలా సుమారు 5,000 దిర్హాముల వేతనం ఎంపికైనవారికి లభిస్తుంది. వారికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాటించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com