ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్..
- October 08, 2021
న్యూ ఢిల్లీ: ఎయిరిండియా విక్రయ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది.ఎయిరిండియా కొనుగోలు బిడ్‌ను టాటా సన్స్ గ్రూప్ ఎట్టకేలకు సొంతం చేసుకుంది.ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం టాటా గ్రూప్‌తో పాటు స్పైస్ జెట్ బిడ్ వేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ఎయిరిండియా ఓపెన్ బిడ్‌ను టాటా సన్స్ గ్రూప్ రూ. 18 వేల కోట్లకు దక్కించుకుంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ కార్యదర్శి తుహిన్ కాంటా పాండే శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇకపై ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణ బాధ్యత మొత్తం టాటా సన్స్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిరిండియాలోని వంద శాతం వాటాలను టాటా గ్రూప్ కు విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియాపై అన్ని హక్కులను కోల్పోయింది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయాల్లో ఇదో చారిత్రక ఘట్టంగా మార్కెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఎయిరిండియాకు రూ.60వేల కోట్ల అప్పులు ఉన్నాయి.
ఇక ఎయిరిండియా చరిత్ర విషయానికొస్తే.. భారత స్వాతంత్ర్యానికి ముందు 1946లో టాటా ఎయిర్‌లైన్స్ పేరును ఎయిరిండియాగా మార్చారు. స్వాతంత్ర్యం తర్వాత ఎయిరిండియాలో 49 శాతం భాగస్వామ్యం తీసుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 1953లో ఎయిరిండియాను జాతీయం చేసుకున్న కేంద్రం.. తాజాగా 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంది. డిసెంబర్ నాటికి ఎయిరిండియా టాటా గ్రూప్ చేతికి రానుంది. దీంతో 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018 మార్చిలో కేంద్రం ఎయిర్ ఇండియాలో 76 శాతం షేర్లను అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపింది. అయితే అప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా స్పైస్ జెట్, టాటా సన్స్ బిడ్స్ వేశాయి. ఈ బిడ్‌ను టాటా సన్స్ గెలుచుకోవడంతో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







