భారత్‌లో మరో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్
- October 12, 2021
న్యూఢిల్లీ: 'ఆకాశ ఎయిర్'కు కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. పౌర విమానయాన శాఖ 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఒసి)' జారీ చేసినట్లు కంపెనీ ఆకాశ ఎయిర్ వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది వేసవి నాటికి విమాన యాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించవచ్చని బిలయనీర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. ఎన్‌ఒసి జారీ చేసినందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు పౌర విమానయాన శాఖకు ధన్యవాదాలు' అని ఆకాశ ఎయిర్ సిఇఒ వినరు దూబే ట్వీట్ చేశారు. దూబే గతంలో జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆకాశ ఎయిర్ బోర్డ్ సభ్యుల్లో ఇండిగో మాజీ ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ కూడా ఉన్నారు.వచ్చే నాలుగేళ్లలో 70 విమానాలు నడిపేందుకు ఆకాశా ఎయిర్ సంస్థ ప్లాన్ చేస్తున్నది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







