వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్లో ఒమన్ సింగర్
- March 18, 2016
మార్చ్ 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు ఢిల్లీలో జరిగిన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్లో ఒమన్ కళాకారుడు నదీమ్ అల్ బలుషి పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొనడం గురించి నదీమ్ మాట్లాడుతూ, రెండవ రోజు తాను వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్లో పెర్ఫామ్ చేశాననీ, తాను పాడిన పాటకు మరో ఇద్దరు సింగర్స్ కోరస్‌గా వ్యవహరించారని, మిగతా రెండ్రోజులూ ఆడియన్స్‌లో కూర్చుని, మొత్తం వేడుకను ఎంజాయ్ చేశానని అన్నారు. తన జీవితంలోనే ఇదో ముఖ్యమైన వేడుక అని నదీమ్ చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ తరఫున కమల్ ఖిమ్జి తనను తొలుత సంప్రదించి, ఫెస్టివల్లో పాల్గొనాల్సిందిగా కోరారనీ, ఆ విజ్ఞప్తి మేరకు తాను వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌కి హాజరయ్యానని అన్నారాయన. మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ ప్రపంచం నుంచి ఈజిప్ట్, జోర్డాన్, కువైట్ యూఏఈ మరియు మొరాకో నుంచి కూడా పలువురు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు నదీమ్. 155 దేశాల నుంచి పార్టిసిపెంట్లు అలాగే ప్రేక్షకులు వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్లో పాలుపంచుకున్నట్లు నదీమ్ వివరించారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







