న్యూస్ రివైండ్: వలస కార్మికుల సమ్మె
- March 18, 2016
ఈ వారం వార్తల్లో పలు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలంటే అందులో మొదటి స్థానంలో 60 మంది వలస కార్మికులు చేపట్టిన సమ్మె గురించి ప్రస్తావించాలి. గత కొన్ని రోజులుగా వారికి సరైన ఆహారం లేకపోవడం, అలాగే సరైన జీతాలు అందకపోవడంతో విసిగిపోయిన వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. రెండో ముఖ్యమైన అంశం, సరాసరి వేతన పెంపు జీసీసీలోని మిగతా దేశాలతో పోల్చితే ఒమన్‌లో చాలా తక్కువగా నమోదైంది. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువ పెంపు ఈ ఏడాది చోటుచేసుకుంది. పెరుగుతున్న ఖర్చులతో జీవనం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కటింగులతో సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మూడో అంశం, పౌరులు మరియు నివాసితులు తాజా పాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. భారీ వర్షాలతో రవాణా ఇబ్బందులు తలెత్తి తాజా పాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. నాలుగోది, మస్కట్ ఐకానిక్ ముట్రా కోర్నిచ్ హై ఆక్టేన్ రేస్ ట్రాక్‌తో అలరించనుంది. ఏప్రిల్ 8న జరగనున్న ఈ కార్యక్రమం 20,000 మందికి పైగా అభిమానుల్ని అలరించనుంది. ఐదవది, ఔట్ బౌండ్ ఎయిర్‌లైన్ ప్యాసింజర్స్ 2 ఒమన్ రియాల్స్‌ని అదనంగా పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







