రష్యాలో కుప్ప కూలిన ఫ్లై దుబాయ్ విమానం
- March 19, 2016
దక్షిణ రష్యాలోని రోత్సావ్ ఇన్ డాన్ వద్ద శనివారం ఉదయం దుబాయ్ కు చెందిన ఒక విమానం కూలిపోయింది.ఈ ప్రమాదంలో మొత్తం 61 మంది చనిపోయారు. పెద్ద వర్షం...బలమైన గాలులు వీస్తున్న సమయంలో ల్యాండింగ్ అయ్యే రెండవ ప్రయత్నంలో భూమిని వేగంగా తాకిన ఆ విమానంలో జ్వాలల ఒక్కసారిగా చెలరేగి పెద్ద ప్రేలుడు సంభవించినట్లు స్థానిక అధికారి తెలిపారు.
దుబాయ్ కు చెందిన బోయింగ్ 737 విమానం భూమికి చేరుకొనే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి కుప్పకూలింది. విమానంలో 61 మంది ఉన్నారు వీరందరు చనిపోయారని ఆ అధికారి తెలిపారు. ఈ సమాచారం ను రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ ద్వారా స్థానిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి తెలిపారు. కూలిపోయిన దుబాయ్ విమానంలో మొత్తం 55 మంది ప్రయాణికులు కాగా ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారాని ఆయన తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకు విమాన ప్రమాదం జరిగినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రష్యా లోని రోత్సావ్ ఇన్ డాన్ మార్గంపై దుబాయ్ బోయింగ్ 737 ఆకాశం నుంచి దిగే సమయంలో నేలను ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టింది, దీంతో మంటలు విమానంను చుట్టుముట్టాయి.ఈ మంటలను నియంత్రణకు ఒక గంట సమయం పట్టింది. తొలుత ఈ విమానం రన్వే మీదకు దిగేందుకు ఒక ప్రయత్నం చేసింది...ఆ ప్రయత్నం సాధ్యపడక పోవడంతో మరొక యత్నం చేసింది. ఈ సారి కొన్నివందల మీటర్ల (గజాలు) నుండి నేరుగా భూమిని తాకిందని రష్యన్ వార్తా ఛానల్ లైఫ్ న్యూస్ నివేదించింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







