కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి: WHO
- October 22, 2021
జెనీవా: ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు WHO తాజాగా వెల్లడించింది.ఆరోగ్య కార్యకర్తలకు తొలుత కోవిడ్ వ్యాక్సిన్ లను ఇవ్వాలని WHO చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల పంపిణీలో జరుగుతున్న అసమానతలను ఆయన తప్పుపట్టారు.
గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు కోవిడ్‌పై పోరాటంలో హెల్త్‌వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ల జాప్యం వల్ల కరోనా వచ్చే ఏడాది కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు మరో WHO అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. అయితే 119 దేశాలకు చెందిన డేటా ప్రకారం.. ప్రతి అయిదుగురిలో ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
ఆఫ్రికాలో పది మందిలో, ఒక హెల్త్‌వర్కర్ మాత్రమే వ్యాక్సినేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఇక సంపన్న దేశాల్లో పది మందిలో.. 8 మంది వ్యాక్సిన్ లు వేయించుకున్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవలం 5 శాతం జనాభా మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







